ఆంధ్రప్రదేశ్‌

కడప జిల్లాలో రెండు హజ్ ఈ - సేవా సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: కడప జిల్లాలోని కడప, రాయచోటిల్లో రెండు చోట్ల హజ్ ఈ - సేవా సెంటర్‌లను ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో ఉచితంగా హజ్ దరఖాస్తులు నింపడానికి హజ్ ఈ - సేవా సెంటర్‌లు పని చేస్తాయని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోమవారం ఒక నేడొక ప్రకటనలో తెలిపారు. ఉచితంగా దరఖాస్తులు నింపడానికి ఏపీ స్టేట్ హజ్ కమిటీ 13 జిల్లాల్లోనూ జిల్లా హజ్ సొసైటీల ద్వారా హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి సలహాలు, సూచనలు, సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. కడప జిల్లాలో రెండు చోట్ల హజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేశామన్నారు. హజ్ ఈ - సేవా సెంటర్ల సేవలు ఉపయోగించుకుని ఉచితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు భర్తీ చేసుకోవాలని ఆయన తెలిపారు. హజ్ దరఖాస్తు నింపడానికి చివరి తేదీ నవంబర్ 10 కాగా దరఖాస్తు ఫీజు రూ. 300. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచే హజ్ యాత్రకు వెళ్లాలని అంజద్ బాషా పిలుపునిచ్చారు. సీఎం జగన్ పట్టుదల వల్లే 2020 హజ్ యాత్ర విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి సాధ్యమై ముస్లింల కల నెరవేరిందని అన్నారు.