ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక మాంద్యంలోనూ అభివృద్ధి దిశగా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 14 : దేశం ఆర్థికమాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంకుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన వార్డు సచివాలయాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ.5 వేల కోట్లతో రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల టీడీపీ పాలన అవినీతిమయమని దుయ్యబట్టారు. ప్రతి పనిలోనూ కమీషన్లు, పర్సంటేజీలతో తెలుగు తమ్ముళ్లు ప్రజలను పీక్కుతిన్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా క్షేత్ర స్థాయిలో పాలనను గాడిలో పెట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోను లేనివిధంగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే తమ ప్రభుత్వం 5 లక్షల 34 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. అవినీతికి తావులేకుండా ఉద్యోగుల నియామకాలు చేపట్టామని చెప్పేందుకు గర్వపడుతున్నామని చెప్పారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు ఇకపై సచివాలయాల్లో పరిష్కరించేందుకు సచివాలయ ఉద్యోగులు కృషి చేస్తారన్నారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని కోరారు.

*చిత్రం...మంత్రి మేకపాటి గౌతం కుమార్‌రెడ్డి