ఆంధ్రప్రదేశ్‌

టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీలో ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: తెలంగాణలో గత తొమ్మిది రోజులుగా ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు సాగిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఏపీఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్, ఇతర కార్మిక సంఘాలు కల్సి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల్లో జరిపిన ధర్నాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఈయు రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి మరియు జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ కనీసం చర్చలకు ఆహ్వానించకుండా తెలంగాణ ప్రభుత్వం కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తూ కార్మికులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం భావ్యం కాదన్నారు. దీన్ని భరించలేకనే ఖమ్మంలో ఒక కార్మికుడు బలవన్మరణం చెందాడన్నారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపనందులకు నిరసనగా తొలి దశలో ఆదివారం ధర్నాలు నిర్వహించామని, రెండో దశలో ఈ నెల 19న జరిగే తెలంగాణ బంద్‌కు మద్దతుగా ఆంధ్రాలో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులందరూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని అన్నారు. అప్పటికీ తెలంగాణా ప్రభుత్వం దిగిరాని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణను అప్పుడు ప్రకటిస్తామన్నారు. తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నందున ధైర్యంగా పోరాటాలు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.