ఆంధ్రప్రదేశ్‌

లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 12: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అనర్హుల నియామకం దగ్గర నుంచి, గతంలో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఇపుడు వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీసీఐడి విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసిఎల్‌ఎ) రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు డిమాండ్ చేశారు.
విద్యార్ధినిలను లైంగిక వేధింపుల ఉదంతంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరపాలని, ఆరోపణలు ఎదుర్కొంటోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకులు, విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసులో వాస్తవాలు వెలుగు చూడవని, సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కాపాడుకుంటారని, వాస్తవాలు బయటకు రానివ్వరని కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను తక్షణం విధుల నుంచి తొలగించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టామని ఏపీసీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. లైంగిక ఆరోపణలపై విచారణ జరపకుండా యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య సురేష్ వర్మ ఇటువంటి ఆరోపణలతో యూనివర్సిటీ పరువు ప్రతిష్ట దెబ్బతీయడానికే చేస్తున్నారని పేర్కొనడం దారుణమని ముప్పాళ్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు, విద్యార్థులను భయపెట్టేందుకు, ముందుగానే తప్పుడు ఫిర్యాదు అని విచారణ జరపకుండా ప్రకటించడం దురుద్దేశం తో చేసిన పని అని ముప్పాళ్ల ఆరోపించారు. దీనినిబట్టి యూనివర్సిటీ వీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ నివేదికను నమ్మాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సీబీసీఐడీ విచారణ జరిపించి యూనివర్సిటీలో ఇప్పటి వరకు జరిగిన అనర్హుల నియామకం దగ్గర్నుంచి, గతంలో లైంగిక వేధింపులకు పాల్పడిన, ఇపుడు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరపాల్సి ఉందని ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు.
యూనివర్సిటీ కమిటీలో అత్యధిక శాతం మంది అనర్హులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టులో దాదాపు 13 మంది అర్హత లేనివారున్నారని పేర్కొన్నారన్నారు.