ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టు సుమోటో ఆదేశాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద గోదావరిలో టూరిజం బోటు ప్రమాదాన్ని హైకోర్టు సుమోటాగా స్వీకరించి, వెలికితీతకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విజ్ఞప్తిచేశారు. ప్రమాద బాధితుల తరపున ఆయన విజ్ఞప్తిచేశారు. బోటును వెలికితీయాలని, ప్రమాదంలో గల్లంతైన వారందరి ఆచూకీ తెలిసేంతవరకు బాధిత కుటుంబాల తరపున పోరాడానని ఆయన ప్రకటించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబాలతో కలిసి సోమవారం ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఈసందర్భంగా హర్షకుమార్ మాట్లాడారు. గోదావరి నదిలో బోటు బోల్తాపడిన ఘటన చాలా పెద్ద ప్రమాదమని, దాదాపు 50 మందికి పైగా గల్లంతైనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి మొక్కుబడిగా సమీక్ష చేసి వెళ్ళిపోవడం సరికాదని హర్షకుమార్ విమర్శించారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా ఈ రోజుకీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఈ రోజు ఆస్పత్రి వద్ద మూడు టెంట్లు వేశారన్నారు.
మంత్రులు గానీ, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే గానీ బాధితుల పక్షాన ఒక గంట ఆస్పత్రి వద్ద కూర్చుని వారి బాధను పంచుకున్న దాఖలాలు లేవన్నారు. కనీసం ప్రతిపక్షాల నుంచి ముఖ్య నేతలంతా వచ్చి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని కోరారు. అపుడే ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుందన్నారు. బోటు వెలికితీస్తే నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు.