ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ సిటీగా అమరావతి, రూ. 750 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: స్మార్ట్ సిటీ మిషన్ కింద రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు 750 కోట్ల రూపాయల కేటాయింపునకు పాలనామోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రాజధాని పనులకు సంబంధించి నాలుగు బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఈ నిధులు మంజూరు చేశారు. కానీ ఆ నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకురావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు నిధుల విడుదలకు పాలనామోదాన్ని తెలిపింది. ఒక బిల్లు విలువ 384 కోట్ల రూపాయలు కాగా, మరో బిల్లు విలువ 366 కోట్ల రూపాయలు.
లీగల్ మెట్రాలజీలో పోస్టుల రీ-డిజిగ్నేషన్
లీగల్ మెట్రాలజీ విభాగంలో మూడు పోస్టులను రీ-డిజిగ్నేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై డిస్ట్రిక్ట్ ఇన్స్‌పెక్టర్‌ను అసిస్టెంట్ కంట్రోలర్‌గా, అసిస్టెంట్ కంట్రోలర్‌ను డిప్యూటీ కంట్రోలర్‌గా, రీజినల్ డిప్యూటీ కంట్రోలర్‌ను జాయింట్ కంట్రోలర్‌గా వ్యవహరిస్తారు. 13 జిల్లాల్లోని రహదారులు, భవనాల శాఖకు చెందిన డివిజన్ కార్యాలయాలను కేంద్ర కార్యాలయంతో నెట్‌వర్కు ద్వారా అనుసంధానం చేసేందుకు వీలుగా 55.25 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జలవనరుల శాఖలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 32 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఈఈలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.