ఆంధ్రప్రదేశ్‌

బాబుకు నోటీసులు కక్ష సాధింపు చర్యే: బుద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 21: ప్రతిపక్షనేతను టార్గెట్‌గా చేసుకుని మాత్రమే వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తోందని, ప్రజల కష్టనష్టాలను అస్సలు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే అంటూ శనివారం మీడియాకు తెలిపారు. కృష్ణానది కరకట్టపై అనేక కట్టడాలు ఉంటే కేవలం ఒక్క ఇంటికి మాత్రమే సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంలో అంతర్యం ఏమిటన్నారు. గతంలో ప్రజావేదికను తనకు కేటాయించాలని ప్రతిపక్ష నేత కోరితే, కనీసం స్పందించ కుండా కూల్చి వేశారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను భయభ్రాంతులను గురి చేస్తూ, వారిపై కక్షసాధింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. దీనిలో భాగంగానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో బోటు మునిగిపోతే వారం రోజులైనా మృతదేహాలను వెలికి తీయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే పట్టించుకోని ప్రభుత్వం నోటీసులు అంటూ రాజకీయం చేస్తుందన్నారు. చంద్రబాబు నివాసానికి వారం రోజుల సమయం ఇవ్వడం అనేది కక్షసాధింపు చర్యేనన్నారు.
బాత్రూంలో బాబాయికి గుండెపోటు ఘటనను బాగా రక్తికట్టించారు శకుని మామా అంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. వైసీపీ చేస్తున్న శవరాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఎన్నోసార్లు చూశారంటూ శనివారం ట్విట్టర్ వేదికగా బుద్దా ప్రకటించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంత్యక్రియల డ్రామాను అద్భుతంగా ప్రదర్శించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్విట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అవినీతిలో నిండా మునిగి చిప్పకూడు తిని ఆరితేరి ఉన్న మీకు నిరుద్యోగుల బాధ ఎం తెలుస్తుందని విజయసాయిరెడ్డినుద్దేశించి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.