ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ వేధింపులు అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. మంగళ వారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనేది అసత్య ప్రచారమని ఖండించారు. కోడెలపై ప్రభ్వుం ఎలాంటి కేసులు బనాయించలేదని కాంట్రాక్టర్లు, బిల్డర్లు మాత్రమే ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు మాట వినే ఆయన గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయలేదని విమర్శించారు. కోడెలపై తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఇటీవలి కాలంలో కోడెలకు చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. మంత్రి పదవి కోరితే స్పీకర్‌తో సరిపుచ్చి అవమానించారన్నారు. పార్టీలో ఆయనకు సరైన గౌరవం ఇవ్వకుండా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారన్నారు. కోడెల కుమారుడు, కుమార్తె బాధితులం అంటూ నరసరావుపేట, సత్తెనపల్లిలో చాలామంది కాంట్రాక్టర్లు, బిల్డర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకువెళ్లినట్లు కోడెల స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారని ఆయనకు, కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కోడెల కేసులు పెడితే చనిపోయేంత పిరికివాడు కాదన్నారు. నమ్ముకున్న సొంత పార్టీ అధ్యక్షుడే వదిలించుకోవాలని అనుకున్నప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. కోడెల కాల్‌డేటా తీస్తే చంద్రబాబును కలిసేందుకు ఎన్నిసార్లు ఫోన్‌చేశారో తేలుతుందన్నారు. కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని మంత్రి నాని డిమాండ్ చేశారు.