ఆంధ్రప్రదేశ్‌

శాంతించిన వరద గోదారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహే0ద్రవరం : గోదావరి నదిలో వరద నీటి ప్రవాహ ఉద్ధృతి శాంతించింది..దీంతో పరీవాహంలో ముంపు కాస్తంత తగ్గుముఖం పట్టింది..బుధవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఈ క్రమంలో సాయంత్రానికి బ్యారేజీ వద్ద ప్రవాహ ఉద్ధృతి 11.50 అడుగుల మట్టానికి చేరడంతో 9.56 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి మళ్లాయి. ఉదయం పది గంటలకు 12.60 అడుగుల్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి నుంచి కూడా బయట పడింది.
అయితే బ్యారేజి దిగువ ప్రాంతంలో మాత్రం నదీ పాయల మధ్య కోనసీమ లంక ప్రాంతాల్లో ఉద్ధృతంగానే ప్రవహిస్తూ వేగంగా సముద్రంలోకి నీరు ప్రవహిస్తోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో ఎటపాక, వర రామచంద్రపురం, కూనవరం, చింతూరు, దేవీపట్నం మండలాల్లో ఇంకా సుమారు 76 గ్రామాలు జల దిగ్భంధంలోనే వున్నాయి. ముంపు గ్రామాల మధ్య నావలపై ప్రజలను దాటిస్తున్నారు. రంపచోడవరంలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. దేవీపట్నం మండలంలో 34 గ్రామాలు కాఫర్ డ్యామ్ వల్ల ముంపు ఇంకా తగ్గలేదు. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద ఉద్ధృతి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో 12.90 మీటర్ల నుంచి తగ్గు ముఖం పట్టింది. ధవళేశ్వరం వద్ద మూడు గంటలకు 11.70 అడుగులకు మట్టానికి చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఆ సమయంలో 9.80 లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి పోయాయి. ఉదయం ఆరు గంటలకు భద్రాచలం వద్ద 35.40 అడుగులు నమోదు కాగా ధవళేశ్వరం వద్ద 13.10 అడుగులు నమోదైంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి నుంచి బయట పడింది. ఆ సమయంలో కూనవరం వద్ద 16.66 మీటర్లు, కుంట వద్ద 9.60 మీటర్లు, కొయిదా వద్ద 23.55, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.77 మీటర్లు, కాళేశ్వరం వద్ద 9.76, పేరూరు వద్ద 10.98 మీటర్ల నీటి మట్టాలు క్రమేపీ గంట గంటకూ తగ్గుముఖం పట్టాయి.
దేవీపట్నం మండలంలో గతంలో ఎపుడూ లేని విధంగా ముంపు ఎదురైంది. దీంతో వారం రోజులుగా గ్రామాలు ముంపులోనే వున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. మంచినీటి కోసం బాధితులు వెంపర్లాడుతున్నారు. కేవలం డాబా ఇళ్లున్న వారు తమ సామాన్లు పోతాయనే ఉద్ధేశ్యంతో పునరావాస కేంద్రానికి వెళ్లకుండా డాబాలపైనే తలదాచుకున్నారు. మిగిలిన ఇళ్లల్లో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ముంపు గ్రామాల్లో వెతలు వర్ణనాతీతంగా వున్నాయి. ఇళ్ళల్లోకి పాములు చేరడంతో జనం విష కీటకాల మధ్య జీవనం సాగిస్తున్నారు. ముంపు మరో వారం రోజులకు గానీ పూర్తిస్థాయిలో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మండలంలోని దాదాపు 34 గ్రామాల్లోని ఇళ్ళల్లోకి వరద నీటితో జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు వెళ్ళేందుకు ప్రస్తుతం రోడ్లు కన్పించడం లేదు. గత నెలలో సంభవించిన వరదకే పునరావాస కేంద్రాలకు తరలించి వుంటే ఈ వరదకు బాధలు తప్పేవని అంటున్నారు.