ఆంధ్రప్రదేశ్‌

మూడవ వారంలో ఆర్థిక గణన ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో ఈనెల 3వ వారం నుంచి ఆర్థిక గణన ప్రారంభం కానుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక గణనకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఈ కార్యక్రమం ప్రారంభించేలా చూడాలని, ఆయా జిల్లాల మంత్రులతో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గణన చేసే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా ఆర్థిక గణన గురించి వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశామని, 11,610 ఎన్యూమరేటర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శులు అనంతరాము, రజత్‌భార్గవ్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్ద జైన్ తదితరులు పాల్గొన్నారు.