ఆంధ్రప్రదేశ్‌

వౌలిక సదుపాయాలు ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: రోడ్లు,డ్రైనేజీ వంటి వౌలిక సదుపాయాలతోనే రానున్న రోజుల్లో గృహనిర్మాణం జరపాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 8 నుంచి ఇంటింటా ఉగాది, ఇంటికి పునాది కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలని ఆదేశించారు. గృహనిర్మాణ శాఖ పనితీరును గురువారం హైదరాబాద్ సచివాలయంలో సమీక్షించిన చంద్రబాబు సకల సదుపాయాలను సమకూర్చిన తర్వాతనే పేదల గృహాల నిర్మాణం చేపట్ట్లాని సూచించారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టబోయే గృహనిర్మాణాలపై తుథి నిర్ణయం తీసుకునేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను నియమించినట్టు బాబు చెచెప్పారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టనున్న హౌసింగ్ నిర్మాణాల్లో యూనివర్శిటీలు, ప్రైవేటు నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పించే యోచన ఉందని అన్నారు. ప్రైవేటు ఆర్కిటెక్టులు, బిల్డర్లు, నిర్మాణ రంగం విద్యను అభ్యసించే విద్యార్ధులను భాగస్వామ్యం చేయడం మంచిదని సిఎం అన్నారు. వారితోనే అర్బన్, ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌లను నిర్మించాలని అన్నారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఎలా ఉండాలనేదానిపై సిఎం అధికారులతో చర్చించారు. మొత్తం ఎన్ని ఇళ్లు నిర్మించాలో, డిమాండ్ ఎంతుందో గమనించి ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత గృహనిర్మాణం చేపట్టాలని సిఎం పేర్కొన్నారు.