ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతంపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం జరుగుతున్నదంటూ వచ్చిన వార్తలపై శాఖాపరమైన విచారణకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోనే ఈ టిక్కెట్లు ముద్రితమైనట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుపతి డిపోకు వెళ్లినట్లు అదికారులు గుర్తించారని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయడమే కాదు... బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ ఏమి జరిగినా దాన్ని ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం సర్వశక్తులు ఒడ్డుతున్నదన్నారు. దీనికి కొన్ని టీవీ చానళ్లు కూడబల్కుని దురద్దేశ పూర్వక ప్రచారంతో శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలనే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు. తిరుమల ప్రతిష్టనూ, ప్రభుత్వ ప్రతిష్టనూ దెబ్బతీసే వారిపై చట్ట ప్రకారం నడుచుకుంటామని మంత్రి వెలంపల్లి అన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో హిందుత్వంపై జరగని అరాచకాలున్నాయా అని ప్రశ్నించారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించడం వరకు అన్ని దుర్మార్గాలు చేశారని అన్నారు. ఈ దుర్గార్గాలన్నీ చేసిన సమయంలో దేవదాయశాఖకు మంత్రిగా ఉన్న బీజేపీ నేత మాణిక్యాలరావు కూడా నేడు విమర్శించటం తగదన్నారు. అన్ని మతాలూ ఆదరించినందునే జగన్ అందరి మనిషి అయ్యారని, అలాగే మతాలన్నీ ఛీ కొట్టబట్టే బాబు అందరికీ దూరమయ్యారని మంత్రి వెలంపల్లి అన్నారు.