ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా మార్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 23: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ బ్రహ్మం రూపొందించిన యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను చంద్రబాబు నాయుడు శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని యూనివర్శిటీలు, కళాశాలల్లో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి విద్యార్థులను చైతన్యపర్చాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలను పటిష్టపర్చామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీలైన ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత వంటి విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు ఆలూరి రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నం వంశీ, నాయకులు బిక్కూ నాయక్, పి నవీన్ తదితరులు పాల్గొన్నారు.