ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 23: తిరుమలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఉద్యానవనంలో కాళీయమర్థనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సవం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ పార్వతి, డిప్యూటీ ఈఓ నాగరత్న ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 7.30 నుంచి 9.30 గంట వరకు శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహించారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపట్టారు. కాగా శనివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఉట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీ కృష్ణ స్వామి వారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
గోవులను సంరక్షించుకుందాం: వైవీ
ఇదిలావుండగా తిరుపతి టీటీడీ గోశాలలో గోకులాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవిసుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వేదాలు, పురాణాల్లో పేర్కొన్నట్లుగా సకల దేవతా స్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. భక్తి శ్రద్ధలతో గోకులాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందన్నారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, పలమనేరుల్లో గోసంరక్షణ శాలల్లో 2991 గోవులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందులో దాదాపు 39 రకాల దేశవాళీ గోవుల జాతులు ఉన్నాయని, వీటిని సంరక్షించి వ్యాప్తి చేసేందుకు విశేష కృషి జరుగుతోందని చెప్పారు. ఈకార్యక్రమంలో తుడా చైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ తిరుపతి జేఈఓ పి.బసంత్ కుమార్, పలమనేరు ఎమ్మెల్యే వేంకటేష్ గౌడ్, టీటీడీ సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, గోశాల సంచాలకులు డాక్టర్ కె.హరినాథ రెడ్డి, డిప్యూటీ ఈఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.