ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 23: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఉద్ఘాటించారు. శుక్రవారం ఒంగోలు మండలం దేవరంపాడులోని ఉప్పు సత్యాగ్రహం విజయస్ధూపం వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని మంత్రులు బాలినేని, ఆదిమూలపు, కలెక్టర్ పోల భాస్కర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి గుండెలు చూపించి ఎదురు నిలిచిన మహావ్యక్తి ప్రకాశం పంతులు అని శ్లాఘించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ అనేక ధర్నాలు చేపట్టారన్నారు. సైమన్ గోబ్యాక్ అంటూ బ్రిటీష్‌వారికి గుండె చూపి ఆంధ్రకేసరిగా నిలబడ్టారన్నారు. దేశం కోసం ప్రకాశంపంతులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. రాష్ట్రంలో జమీందారి వ్యవస్థకు చరమగీతం పాడి రైతులకు భూమి హక్కును కల్పించారన్నారు. రెవెన్యూ మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లా వినోదరాయునివారిపాలెం గ్రామంలో జన్మించి రాష్ట్రం గర్వించే విధంగా ప్రజలకు సేవలందించారన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందకు ఒక లక్షా 50వేల మందికి గ్రామస్ధాయిలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుందన్నారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్య్ర ఉద్యమంలో విశేష పాత్ర పోషించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రకాశం జిల్లాలో జన్మించి రాష్ట్రానికి ఎనలేని సేవలందించారని తెలిపారు. ఈసందర్బంగా దేవరంపాడు ఉప్పు సత్యాగ్రహ స్ధూపం వద్ద మంత్రి బాలినేని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులు ప్రకాశం పంతులు జీవిత విశేషాలను తెలియచేసే ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు టీజెఆర్ సుధాకర్‌బాబు, దర్శిశాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, జిల్లా జాయింట్‌కలెక్టర్ షన్ మోహన్, ట్రైనీ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు,డ్వామా పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.