ఆంధ్రప్రదేశ్‌

మీ ప్రతి నిర్ణయం ప్రజలకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 23: పాదయాత్రలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంటూ చెప్పి, అధికారంలోనికి వచ్చాక ఆంక్షల పేరుతో అన్నింటిలోనూ కోతలు విధించడం దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రతీ అంశంలోనూ నిబంధనలను మార్చుతూ రాష్ట్ర ప్రజలు ఎందుకు శిక్షిస్తున్నారని శుక్రవారం ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని లోకేష్ ప్రశ్నించారు. అధికారం కోసం మాయమాటలు చెప్పి పీఠం ఎక్కాక మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం ప్రజలకు శాపంలా మారిందన్నారు. ఆంక్షల పేరుతో మీరు అమలు చేస్తున్న కోతలు సామాన్య ప్రజలను కష్టాలకు గురి చేస్తున్నాయన్నారు. మీకు ఓటు వేయడమే వారికి నేడు శాపంగా మారిందన్నారు. హామీల నుండి పథకాలకు వచ్చే సరికే సగం మంది లబ్ధిదారులను తీసేసారని, ప్రస్తుతం మరికొన్ని నిబంధనలతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. తొలగించే కుట్రతోనే రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవాలంటున్నారని మండిపడ్డారు. పోనీ ఆ పనైనా సరైన ప్రణాళిక, అధికారుల పర్యవేక్షణతో చేస్తున్నారా అంటే అది కూడా లేదన్నారు. పిల్లలు, మహిళలు గడిచిన 20 రోజులుగా ఎన్ని అవస్థలు పడుతున్నారో కొంచెమయినా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. వెంటనే ఈకేవైసీ నమోదు కేంద్రాలను పెంచి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని లోకేష్ సూచించారు.