ఆంధ్రప్రదేశ్‌

అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు మీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 23: అవినీతిలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. అవినీతికి మీరు, దొంగబ్బాయ్‌లు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌ను సంభోదిస్తూ శుక్రవారం ట్విట్టర్‌లో వెంకన్న ఎద్దేవా చేశారు. 11 ఛార్జిషీట్లు, లక్ష కోట్ల అవినీతితో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన మీరు అవినీతి గురించి మాట్లాడటం ఎమీ బాగోలేదన్నారు. 16 నెలల పాటు జైలు ఉచలు లెక్క పెట్టినా కూడా నీ లోనూ, మీ నాయకుడిలోనూ మార్పు రాలేదన్నారు. తొందరలోనే తిరిగి మీ ఇంటికి.. అదే జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రధాని కార్యాలయంలో దొంగలా కూర్చొని బ్రోకర్ పనులు చేస్తూ అడ్డంగా దొరికి పోయిన మీరు లాబీయింగ్ గురించి మాట్లాడుతున్నారా అంటూ వెంకన్న ప్రశ్నించారు. బీజేపీలో అన్నీ నేను చెప్పినట్టే జరుగుతున్నాయి, అన్నీ మోదీ, షాకు చెప్పే చేస్తున్నా అంటున్నారు.. అంటే కొంప తీసి కన్నా కుర్చీపై కనే్నశారా ఏమిటి... అంటూ వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.