ఆంధ్రప్రదేశ్‌

వరద బాధితులను తక్షణం ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఆగస్టు 19: కృష్ణానది వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ముంపునకు గురైన లంక గ్రామాలలో సోమవారం కన్నా పర్యటించారు. కృష్ణాజిల్లా మోపిదేవి నుండి గుంటూరు జిల్లా రేపల్లె, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలలో వరద కారణంగా నీటమునిగిన గ్రామాల ప్రజలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ఇంత పెద్దమొత్తంలో కృష్ణానది నుండి వరద ముంపు రాలేదని, పెద్దమొత్తంలో వాణిజ్య పంటలకు, ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వేల హెక్టార్ల వాణిజ్యపంట నీట మునిగినట్లు అధికారులు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గినందున గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, పునరావాస కేంద్రాలలో బాధితులకు వసతులు, సౌకర్యాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో నీటమునిగిన గృహాలు, పంట నష్టం అంచనాలు వెంటనే సేకరించి బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహాయం అందేలా తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునే విషయంలో తక్షణమే స్పందించాలని తెలిపారు. ముఖ్యంగా కొల్లూరు మండలం లంక గ్రామాలలో పెద్దమొత్తంలో ఆస్తి, పంటల నష్టం జరిగినట్లు రైతులు, అధికారులు చెబుతున్నందున ఆయా ప్రాంతాలలో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారుల అప్రమత్తంగా ఉన్న కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే భట్టిప్రోలు మండలంలో ఇద్దరు వ్యక్తులు వరదలో కొట్టుకుపోగా, వారిలో ఒకరు క్షేమంగా బయటపడ్డారని మరోవ్యక్తి ఆచూకీ రెండు రోజులుగా దొరకలేదని స్థానికులు కన్నా దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన ఆచూకీ లభించని కుటుంబ సభ్యులకు ఓదార్పు ప్రకటిస్తూ అధికారులు గజ ఈతగాళ్ళ ద్వారా వ్యక్తి ఆచూకీ కనుగొనాలని సూచించారు.