ఆంధ్రప్రదేశ్‌

మంత్రులను అడ్డుకున్న టీడీపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: చంద్రబాబు నివాస పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులను తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టించిన అనంతరం సాయంత్రం సమయంలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వచ్చిన మంత్రులను అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కా
ర్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా పరస్పర నినాదాలు చేయడంతో పరిస్థితి మరోమారు ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు నివాసం రహదారి వద్ద ఉన్న ప్రధాన గేటు నుంచి నివాసంలోకి వెళ్లేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది వారిని నిలిపివేయగా, అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మంత్రులు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కృష్ణానదిలో వరద తీవ్రత అధికంగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరదనీరు కరకట్టలోపల ఉన్న నివాసాల్లోకి రావడంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టామని, ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవద్దని హితవుపలికారు.