ఆంధ్రప్రదేశ్‌

రేషన్ డీలర్లలో అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 19: గ్రామ వలంటీర్ల నియామకంతో రేషను డీలర్ల వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడనుందనే వార్తల నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న డీలర్లలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మండల, డివిజన్ల స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న డీలర్లు శనివారం విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామాల వారీగా ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి, వారి ద్వారా రేషన్ బియ్యం తదితరాలు ఇంటికే అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. దీనితో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన డీలర్లలో నెలకొంది. ఇంత వరకు డీలర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,787 రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీచేస్తున్న డీలర్లు ఆయా మండలాల్లో తహసీల్దార్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలను అందించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 2018లో రేషన్ డీలర్లు అంతా కలిసి ‘ఆంధ్రప్రదేశ్ ఫెయిర్ ప్రైస్ షాపు డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ను ఏర్పాటుచేసుకున్నారు.