ఆంధ్రప్రదేశ్‌

ఉత్తర అండమాన్‌లో ప్రవేశించిన ‘నైరుతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: దక్షిణ అండమాన్ దీవుల నుంచి నైరుతి రుతు పవనాలు ఉత్తర అండమాన్ దీవుల్లోకి ప్రవేశించాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం శనివారం రాత్రి పేర్కొంది. గతంలో కంటే ఇవి కాస్తంత ముందుగానే వచ్చాయని ఈ కేంద్రం తెలిపింది. వచ్చేనెల నాలుగో తేదీ వరకు వీటిలో కదలిక ఉండకపోవచ్చని తెలియజేసింది. ఎండల తీవ్రత మరో నాలుగు రోజులు కొనసాగుతాయని, ముఖ్యంగా విదర్భ, తెలంగాణా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్రత ఉంటుందని, సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉంటాయని కేంద్రం తెలియజేసింది. మరో నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతల తీవ్రత, వడగాల్పులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో సాధారణం కంటే కూడా ఉష్ణోగ్రతల తీవ్రత ఉంటుందని తెలిపింది. ఏపీలో శనివారం పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధికంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. ఇందులో తిరుపతి - 44డిగ్రీలు, నెల్లూరు - 43, కావలి - 41, కాకినాడ - 40, విజయవాడ - 43, ఒంగోలు-41, జంగమహేశ్వరపురం - 44, విశాఖపట్నం విమానాశ్రయంలో 37 డిగ్రీలు, బాపట్లలో 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిపోతున్న కాలుష్యం, గాలిలో తేమ శాతం కారణంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది. నైరుతి రుతుపవనాలు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడిన ప్రాంతాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. తప్పితే వాతావరణంలో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది.