ఆంధ్రప్రదేశ్‌

మెట్టలో మల్బరీ సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 5: వృత్తి నైపుణ్య శిక్షణ, విస్తృత ప్రచారాలతో మల్బరీ తోటల పెంపకాన్ని గణనీయంగా వృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తోంది. మల్బరీ తోటల పెంపకం, పట్టుగూళ్ల అభివృద్ధి, నేత, అల్లికలు వంటి అంశాల్లో సమగ్ర శిక్షణ ఇస్తోంది. నాబార్డు, రిక్వీ, ఆర్మా వంటి సంస్థల సహకారంతో అధిక ఉత్పత్తి సాధనకు కృషి చేస్తోంది. రైతుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి పెద్దఎత్తున సాంకేతిక సర్వీసు సెంటర్లు ఏర్పాటు చేసింది. మల్బరీ తోటల అధికోత్పత్తికి, వైవిధ్యభరితమైన పట్టుపురుగుల ఉత్పత్తికి శాస్త్ర సాంకేతిక రంగాల సహాయాన్ని తీసుకుంటోంది. మెట్ట ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయక సవాళ్లను అధిగమించేందుకు పట్టు పరిశ్రమను సమర్థ ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతులు మల్బరీ సాగుకు, పట్టు పురుగులు పెంచే షెడ్ల నిర్మాణం కోసం, పెంపక సామగ్రికి, మందులకు, బ్రష్ కట్టర్లు, పవర్ స్ప్రేయర్లు, సికేచర్ల లాంటి పరికరాలను రాయితీపై సమకూరుస్తోంది. 2016-17 రాష్ట్ర బడ్జెట్‌లో పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.147 కోట్లు కేటాయించింది. కోస్తా జిల్లాలను పట్టు పరిశ్రమలకు అనువైనదిగా గుర్తించి అప్పటికి ఉన్న 2,242 ఎకరాల మల్బరీ సాగును 3,978.50 ఎకరాలకు పెంచి 77.45 శాతం, బైవోల్టిన్ పట్టు గూళ్ల ఉత్పత్తి 2,272.60 మెట్రిక్ టన్నుల నుంచి 4,530.30 మెట్రిక్ టన్నులకు పెంచి 99.34 శాతం వృద్ధి సాధించింది. రైతులు పండించిన పట్టుగూళ్లకు ప్రోత్సాహక ధర లభించేందుకు గాను చిత్తూరు జిల్లా మదనపల్లిలో 400 ఎండ్స్, ఆటోమాటిక్ రీలింగ్ యంత్రాన్ని నెలకొల్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి చైనా దేశానికి చెందిన వ్యాపారస్థుని ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం లేకుండానే ఏర్పాటుచేసిన ఈ యంత్రంతో అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల ముడి పట్టుదారం ఉత్పత్తి చేస్తున్నారు. 2015-16లో రాష్ట్రంలో పట్టు పరిశ్రమాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.3కోట్ల 86 లక్షల 80 వేలు ఖర్చు చేయడానికి అనుమతించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కృషి ఫలితంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న ముడి పట్టుదారంపై కేజీకి యూఎస్ డాలర్ 1.85 దిగుమతి సుంకం పెంచడం జరిగింది. మొట్టమొదటిసారిగా మల్బరీ తోటలు నాటేందుకు, రెండేళ్లు మల్బరీ తోటల నిర్వహణకు, పట్టు పురుగులను పెంచే షెడ్లకు కూలీ ఖర్చుల నిమిత్తం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సహాయం ప్రభుత్వం కల్పించింది.