ఆంధ్రప్రదేశ్‌

పోలవరం అనుమతులకు త్వరలో లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: కేంద్ర అటవీ శాఖ నుండి త్వరితగతిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు రానున్నాయని రాష్ట్ర అటవీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి అనిల్ మాధవ్ దవేతో సమావేశమైన గోపాల కృష్ణారెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు. ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి సంబంధించి రాష్ట్రానికి రావల్సిన నిధులను సత్వరం విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. నగరాల వనాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, తాజాగా చేపట్టిన మొక్కల పెంపకం ఉద్యమంతో పాటు అడవుల విస్తరణకు తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రం నిర్ణయించుకున్న లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. కెంపా నిధులను రెండు మూడు రోజుల్లోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు జాప్యం లేకుండా ఇవ్వాలని కోరగా దానికి కేంద్ర మంత్రి ఆమోదించారని అన్నారు. ఆగస్టు 15 తర్వాత తాను రాష్ట్రానికి వచ్చి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రాంతాన్ని స్వయంగా సందర్శిస్తానని దవే చెప్పారు. ఎర్ర చందనం గురించి ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎర్ర చందనానికి విదేశాల్లో మించి గిరాకీ ఉన్నందున వీటి పెంపకాన్ని ఉపాధి కల్పన చేపట్టడానికి వీలయ్యే అంశాలను పరిశీలించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకు కేంద్రం నుండి అదనంగా సాయం చేయడానికి వీలయ్యే అంశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్, రాష్ట్ర అటవీ ముఖ్య ప్రధాన సంరక్షణాధికారి మిశ్రా, అదనపు ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణాధికారి కె ఎస్ రెడ్డి పాల్గొన్నారు.