ఆంధ్రప్రదేశ్‌

దగాపడ్డ కులాలకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 4:దగాపడిన కులాలకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రజ క, నారుూ బ్రాహ్మణ, వడ్డెర, కుమ్మరి/శాలివాహన, సగర, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ల చైర్మన్లు, డైరక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారిని పైకి తీసుకురావడానికి బీజం వేసింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు. వెనుకబడిన తరగతులకు 8,840 కోట్లతో సబ్‌ప్లాన్ తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో 400 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, 1600 కోట్ల ట్యూషన్ ఫీజు, 300 కోట్ల ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేశామని, 300 కోట్లతో రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మున్సిపల్ స్కూళ్ళలో 94 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, హాస్టళ్ళలో 96 శాతం మంది ఉత్తీర్ణులుకాగా, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో 98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన చెప్పారు. అందుకే సంక్షేమ హాస్టళ్ళను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చుతున్నామని ఇందుకోసం 107 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని సిఎం చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బిసి విద్యార్థులకు 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ఆయన తెలియచేశారు. వాషర్‌మెన్ ఫెడరేషన్‌కు 32 కోట్లు, నారుూబ్రాహ్మణ ఫెడరేషన్‌కు 33 కోట్లు, వడ్డెల ఫెడరేషన్‌కు 22 కోట్లు, సగరల ఫెడరేషన్‌కు 16 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌కు 22 కోట్లు, కుమ్మరి ఫెడరేషన్‌కు 22 కోట్లు కేటాయించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. బిసిలు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌గా ఏర్పడి 25 లక్షలతో పరిశ్రమ స్థాపించాలనుకుంటే 10 లక్షలు సబ్సిడీగా, మిగిలిన 15 లక్షలు స్పల్వ వడ్డీతో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతకు ముందు ఫెడరేషన్ చైర్మన్లు, డైరక్టర్లతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు.

చిత్రం.. ఫెడరేషన్ చైర్లన్లతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న చంద్రబాబు