ఆంధ్రప్రదేశ్‌

జిఎస్టీతో ఆంధ్రకు 4700 కోట్లు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: జిఎస్‌టి అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఏటా 4700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసినట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి జిఎస్‌టి వల్ల 23,500 కోట్లు నష్టం వస్తుందని, దీనిని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పన్ను వ్యవస్థను పర్యవేక్షించడం, అవసరమైతే జోక్యం చేసుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని డిమాండ్ చేశారు. వెరిఫికేషన్ మెకానిజం పక్కాగా ఉండాలని అన్నారు. జిఎస్‌టి కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలకూ, కేంద్రం ప్రాతినిధ్యం ఉన్నా వీటో అధికారం రాష్ట్రాలకు లేదని అన్నారు. కనుక రాష్ట్రాల అభిప్రాయాన్ని అలక్ష్యం చేయకుండా న్యాయం చేయాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బిజినెస్ మీద పన్ను మినహాయింపు వల్ల అటు వినియోగదారులకు, ఇటు ప్రభుత్వానికీ లాభకరమేనని అన్నారు. జిఎస్‌టి వల్ల సరకులపై పన్ను తగ్గినా, సేవలపై పన్ను పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆహార ధాన్యాల ధరలు కూడా పెరగవచ్చని, జిఎస్‌టి కౌన్సిల్‌లో పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని యనమల పేర్కొన్నారు. జిఎస్‌టి బిల్లు అమలులోకి రావడం సంతోషమే అయినా, కొన్ని ఇబ్బందులున్న మాట నిజమేనని పేర్కొన్నారు. గతంలో వ్యాట్ అమలును కూడా తెలుగు దేశం పార్టీ స్వాగతించిందని, పన్నుల సంస్కరణలకు తాము మొదటి నుండి అనుకూలమేనని పేర్కొన్నారు. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జిఎస్‌టి బిల్లును స్వాగతించామని అన్నారు.