ఆంధ్రప్రదేశ్‌

కేంద్రానికి మద్దతు సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన తరుణంలో రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత రావడంతోనే హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మారుస్తున్నారని వైకాపా పార్లమెంట్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రధాన మంత్రి లీక్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి జైట్లీ ప్రసంగం తనకు బాధ కల్గించిందని, ఏపీని అభివృద్ధి చేయడానికి ఎవరూ సహకరించడంలేదని చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు 15 ఏళ్లపాటు హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఆ తరువాత హోదా సంజీవని కాదని మాటమార్చారన్నారు. హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసినా తమ మద్దతును ఉపసంహరించుకోమని, కేంద్ర ప్రభుత్వంలోనే కొనసాగుతామని చెప్పడు సిగ్గుచేటన్నారు. ఒకవేళ అలాగే కొనసాగినా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయించేలా కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పకుండా అమలుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో చిత్తశుద్ది లేకుండా వ్యవహరిస్తుదన్నారు. ప్రత్యేకహోదాపై వైకాపా పోరాటం చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి కూడా హోదాకోసం ఎనిమిది రోజులపాటు దీక్ష చేశారని ఆయన గుర్తుచేశారు.