ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేలకు వైకాపా విప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ నెల 29,30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించే సమయంలో సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ వైకాపా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంగళవారం విప్ జారీ చేసింది. పలమనేరు ఎమ్మెల్యే, పార్టీ విప్ ఎన్ అమరనాథ్ రెడ్డి పేరిట ఈ విప్ జారీ అయింది. 29,30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు వచ్చే సమయంలో సభలో ఉండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విప్‌ను ఇటీవల పార్టీని ఫిరాయించి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు కూడా పంపారు. ఈ విప్‌ను ధిక్కరించి అధికార పార్టీకి ఓటు వేసిన పక్షంలో, వారిని అనర్హత వేటుకు గురి చేయాలనే లక్ష్యంతో వైకాపా ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల్లో పోటీకి
లోక్‌సత్తా దూరం: జెపి

హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ ఇక నుంచి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. ముఖ్యమైన మూడు అంశాలు... స్థానిక సంస్థలకు అధికారాలు, విద్య, ఆరోగ్యం కోసం పోరాడాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 20న పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గత 20 ఏళ్లలో దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాలకు, ఎన్నో వౌలిక మార్పులకు లోక్‌సత్తా నాంది పలికిందని అన్నారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన కీలకమైన మూడు అంశాలపై తక్షణ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల విరామం ప్రకటించినా రాజకీయ పరివర్తన కోసం తమ కృషి కొనసాగుతుందని అన్నారు.