ఆంధ్రప్రదేశ్‌

ఏపీ డీఆర్పీ పనులు సకాలంలో పూర్తి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 23: ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీ డీఆర్పీ) కింద మంజూరు చేసిన ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని ఒకటవ బ్లాక్‌లో ఏపీడీఆర్‌పీ ప్రాజెక్ట్ అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో హుదుద్ తుపాన్‌కు దెబ్బతిన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల పునరుద్ధరణ, వివిధ అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రపంచ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం కలసి రూ. 2వేల 220 కోట్లు మంజూరు చేశాయని, సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. 2015 ఆగస్టు 28 నుండి 2020 సెప్టెంబర్ 30వ తేదీలోగా పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఏపీ ఈపీడీసీఎల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, ఏపీ ఫారెస్ట్ అండ్ పీఎంయు, ఉడా విభాగాల ద్వారా చేపట్టిన పనులన్నింటిలో వేగం పెంచాలన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికల్లా ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇంకా ఖరారుకాని టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మంజూరైన పనులకు విడుదల కావాల్సిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపితే మోడల్ కోడ్ కమిటీ (ఎంసీసీ స్క్రీనింగ్ కమిటీ) సమావేశంలో సమీక్షించి మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ల నిధుల విడుదలకు సంబంధించి గ్రీన్‌చానల్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే పనులను నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాల్సి ఉన్నందున అలసత్వం వహించరాదన్నారు. అనంతరం ఏపీ డీఆర్పీ చేపట్టిన వివిధ ప్రాజెక్ట్ పనులపై ఆరా తీశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివిధ పనుల పురోగతిని వివరించారు. ఆరు కాంపొనెంట్ల కింద నాలుగు ప్యాకేజీల ద్వారా పనులు జరుగుతున్నాయని, మొత్తం రూ. 2,220 కోట్లకు గాను 1792 కోట్లకు పాలనానుమతులు రాగా, రూ. 1539 కోట్ల విలువైన పనులను సంబంధిత ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలకు అప్పగిచామని అందులో అందులో రూ. 694 కోట్ల ఖర్చుచేసి 45 శాతం మేర పనులు నిర్వహించారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మునిసిపల్ పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికలవలవన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శులు జవహర్‌రెడ్డి, అజయ్‌జైన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి పీయూష్‌కుమార్, ఉద్యానవన, స్ర్తి,శిశు సంక్షేమం, మత్స్యశాఖల కమిషనర్లు చిరంజీవి చౌదరి, రమాశంకర్ నాయక్, అరుణ్‌కుమార్, పీసీసీఎఫ్ రిజ్వీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్య తదితరులు వివిధ అంశాలపై చర్చించారు.

చిత్రం...అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం