ఆంధ్రప్రదేశ్‌

ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, ఆగస్టు 1: తరచూ తనకు ఆడపిల్లలే పుడుతున్నారని ఓ కసాయి తండ్రి ఇద్దరు ఆడపిల్లలను చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అటవీ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని నూలుకుంట పంచాయతీకి చెందిన మదనపురం గ్రామంలో మునస్వామి, లక్ష్మిలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం లక్ష్మిపాముకాటుకు గురై చనిపోయింది. కాగా మునస్వామి తమ సమీప బంధువైన మునస్వామి కుమార్తె సరసమ్మను ఇంటిలో నుంచి ఎత్తికెళ్లి సమీప పొలంలో అత్యాచారం చేశాడు. అప్పట్లో ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లడంతో వీరిద్దరికి వివాహం చేశారు.
నాలుగు సంవత్సరాల క్రితం వీరి దాంపత్యానికి గుర్తుగా ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్లకు పేరుపెట్టేందుకు సరసమ్మ కుప్పంకు వచ్చి బ్రాహ్మణుని విచారించి ఇంటికి వెళ్లేలోపు తన భర్త ఏడు నెలల పాప అయిన తన కుమార్తెను గొంతుపై కాలుపెట్టి చంపేసాడని తల్లి సరసమ్మ పేర్కొంది. 11నెలల క్రితం మరో అమ్మాయికి సరసమ్మ జన్మనిచ్చింది. ఆ అమ్మాయి వయస్సు ప్రస్తుతం 10 నెలలు. ఈనేపథ్యంలో మూడవ కాన్పుగా గత నెల 18న సరసమ్మ మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడడంతో విసుగెత్తిన మునస్వామి గతనెల 23న ఐదు రోజుల కన్న కూతుర్ని మొదటి బిడ్డను చంపినట్లే గొంతుపై కాలుపెట్టి చంపేసాడని తల్లి సరసమ్మ పేర్కొంది. ఈ విషయమై అప్పుడే అక్కడే ఉన్న తమ అమ్మ, నాన్నకు చెప్పడంతో వెంటనే సమీపంలోనే ఆ బిడ్డను ఖననం చేశారన్నారు. దీనిపై భార్యను విచారిస్తే ప్రతిరోజు పీకల దాక తాగి తనను చితకబాదుతున్నాడని ఇక చేసేదిలేక పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె పేర్కొంది.