ఆంధ్రప్రదేశ్‌

మద్యం మత్తులో మంత్రి తనయుడి వీరంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 1: మద్యం మత్తులో మంత్రి తనయుడు వీరంగం సృష్టించాడు. ఈ ఉదంతం గుంటూరు నగరంలో వెలుగుచూసింది.. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న జిల్లాకు చెందిన ఓ మంత్రి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గప్‌చుప్‌గా సద్దుమణిగింది. జిల్లాలోని ఓ మంత్రి కుమారుడు తన అనుచరులతో తప్పతాగి అర్ధరాత్రి నగరంలోని ఆర్వీఆర్ జెసి కళాశాల సమీపంలోని బాలికల హాస్టల్ దగ్గరకు చేరుకున్నాడు. ఒళ్లుతెలీని మైకంలో హాస్టల్ వద్ద తన అనుచరులతో కలిసి రగడ చేసి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో సమీపంలోని బాలుర హాస్టల్ విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి తనయుడితో పాటు వచ్చిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు విద్యార్థులను నానా దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి ప్రయత్నించారు. దీంతో హాస్టల్ విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. పట్ట్భాపురం పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మంత్రి తనయుడిని గుర్తించి మందలించి పంపారు. గతంలో కూడా అతను హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ యువతిని వెంబడించి వేధించిన కేసులో అక్కడివారు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో హాస్టల్ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఆయేషా మీరా హత్య కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదని, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్మాదానికి పాల్పడితే తమ భవిష్యత్తు ఏమిటని వారు భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు.