ఆంధ్రప్రదేశ్‌

క్రీస్తు బోధనలే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 19: శిలువ వేసినా విశ్వమానవ శ్రేయస్సుకు పంటి బిగువన బాధలు భరించిన మహిమాన్వితుడు ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. క్రైస్తవ సోదరులందరికీ ఆయన గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ఏసుక్రీస్తు ప్రతీక అని కీర్తించారు. శాంతిదూతగా లోకానికి వచ్చిన ఆయన శాంతి, అహింసతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నిరూపించారన్నారు. విశ్వమానవాళిని ప్రేమతో చూడాలనేదే కరుణామయుని బోధనల సారమన్నారు. సత్యం, త్యాగం, శాంతి సౌభ్రాతృత్వాలతో మానవాళి మెలిగితే క్రీస్తు ఆశీస్సులు సర్వదా లభిస్తాయన్నారు. సత్యం, త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వాలతో మానవాళి మమేకం కావటం అవసరమన్నారు. కాలాన్ని పరిగణించటంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేవి గమనించదగిన అంశాలన్నారు. త్యాగానికి ప్రతీకగా శిలువ వేసిన రోజున జరుపుకునే గుడ్‌ఫ్రైడేతో క్రైస్తవ సోదరులు మమతానురాగాలతో మెలుగుతారని చంద్రబాబు ఉద్బోధించారు.