ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర నిబంధనలతో అందని ఆర్‌బిఐ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 1: అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే, తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని హామీ ఇచ్చిన బిజెపి ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిందేమి లేదని గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల మంత్రి డాక్టర్ మృణాళిని ఆరోపించారు. ప్రత్యేక నిధుల పేరుతో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏ సహాయం అందడంలేదన్నారు. అటు కేంద్ర సహాయం అందకపోవడమే కాకుండా కేంద్రం విధించిన నిబంధనల కారణంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రుణాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మృణాళిని మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాజధానిని, ఉన్నత విద్యా సంస్థలను కోల్పోయిందని, వీటన్నింటిని ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం నుంచి భారీ సహాయం అందవలసి ఉందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఆ మేరకు సహాయం అందించడంలో విఫలమైందని చెప్పారు. గతంలో కొత్తగా ఏర్పడిన ఉత్తరాంచల్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు అందించిన సహాయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు.