ఆంధ్రప్రదేశ్‌

ఎపిపిఎస్సీ పరీక్షకు విధివిధానాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ( ఎపిపిఎస్‌సి) ద్వారా జరిపే ప్రత్యక్ష నియామకాలకు నిర్వహించే పరీక్ష విధివిధానాలను ప్రభుత్వం సోమవారం నాడు ఖరారు చేసింది. గ్రూప్ -1ఎ పరీక్ష 825 మార్కులకు , గ్రూప్ 1బి పరీక్ష 450 మార్కులకు, పంచాయతీ సెక్రటరీల ఎంపిక పరీక్ష 300 మార్కులకు నిర్వహించనున్నారు. గెజిటెడ్ రిక్రూట్‌మెంట్ 500 మార్కులకు, నాన్ గెజిటెడ్ రిక్రూట్‌మెంట్ 330 మార్కులకు నిర్వహిస్తారు. గ్రూప్-1ఎ కు, గెజిటెడ్ రిక్రూట్‌మెంట్‌కు, నాన్ గెజిటెడ్ రిక్రూట్‌మెంట్‌లకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేశారు. గ్రూప్-1 పరీక్ష స్క్రీనింగ్ 150 మార్కులకు జరుగుతుంది. మెయిన్ పరీక్ష జనరల్ ఇంగ్లీషు 150 మార్కులకు , పేపర్ -1 జనరల్ ఎస్సే 150 మార్కులకు, పేపర్-2, పేపర్-3, పేపర్-4, పేపర్-5లు ఒక్కోటి 150 మార్కులకు జరుగుతుంది. ఇంటర్వ్యూ 75 మార్కులకు నిర్వహిస్తారు. గ్రూప్-1బి పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు, మెయిన్ పరీక్ష 450 మార్కులకు జరుగుతుంది. గెజిటెడ్ కేటగిరిలో లిఖిత పరీక్ష 450 మార్కులకు, పార్టుబి కింద ఇంటర్వ్యూ 50 మార్కులకు జరుగుతుంది. నాన్ గెజిటెడ్ పోస్టులకు మాత్రం జనరల్ స్టడీస్ 150 మార్కులకు, సంబంధిత సబ్జెక్టు 150 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు జరుగుతుంది. ఇంటర్వ్యూలు అవసరం లేని ఇతర నాన్ గెజిటెడ్ కేటగిరి పోస్టులకు మాత్రం 450 మార్కులకు నిర్వహిస్తారు.