ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల స్థలాల కోసం కదంతొక్కిన పేదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఏళ్ల తరబడి నివాసముంటున్నవారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజధాని విజయవాడ నగరంలో మూడు రోజులపాటు పరిపాలనను స్తంభింపచేస్తామంటూ అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇల్లు లేదా ఇంటి స్థలం ఇవ్వాలంటూ వామపక్షాల ఛలో విజయవాడ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల నుంచి వేల సంఖ్యలో పేదలు మంగళవారం నగరానికి తరలివచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సభా ప్రాంగణం జింఖానా గ్రౌండ్స్ వరకు కదంతొక్కారు. అర్హులందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని పంపిణీ చేయాలని, కొండ ప్రాంతవాసులకు పట్టాలు, ఆక్రమిత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసముంటున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో పది వామపక్షాల నేతలు మాట్లాడారు. రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మోసగిస్తే హామీల వర్షంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు గత రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు. 13 జిల్లాల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం 2 లక్షల 73 వేల 324 దరఖాస్తులు రాగా కేవలం 3 వేల 662 మందిని మాత్రమే ఎంపిక చేసి వీరే అర్హులంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సభలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత పి.ప్రసాద్, ఎస్‌యుసిఐ నేత బిఎస్ అమర్‌నాథ్, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నేత జి.సత్యనారాయణ, ఎంసిపిఐ (యు) నేత జి.ప్రసాద్, స్థానిక సిపిఐ, సిపిఎం నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.