ఆంధ్రప్రదేశ్‌

ఓటు హక్కుపై విద్యార్థుల్లో చైతన్యం కల్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: ఓటు హక్కు విలువపై ప్రజలను చైతన్యం చేసేందుకు వివిధ శాఖలు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ ఆదేశించారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా రాష్ట్రంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేస్తోందన్నారు. వెలగపూడి సచివాలయంలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శుక్రవారం స్వీప్ సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు ఔన్నత్యం, ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై పాఠశాల స్థాయిలో చక్కని కార్యక్రమాలను రూపొందించామన్నారు. ఉన్నత విద్య, కాలేజీ విద్యార్థులకు విస్తృత స్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్లు, డమీ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాలేజీ విద్యార్థులకు వక్తృత్వపు పోటీలను నిర్వహించి ప్రథమ బహుమతిగా రూ. 10వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 7,500, తృతీయ బహుమతిగా రూ. 5వేలు అందజేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో వక్తృత్వపు పోటీల్లో ప్రథమ బహుమతిగా రూ. 5వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 2,500, అందజేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పెయింటింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రథమ బహుమతిగా రూ. 10వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 7,500, తృతీయ బహుమతిగా రూ. 5వేలు అందజేస్తున్నామన్నారు. ఉన్నత విద్య, కాలేజీల స్థాయిలో ‘మాక్ పోల్’పై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఇందులో ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయ కర్తలను భాగస్వాములను చేయాలని ఆమె కోరారు.