ఆంధ్రప్రదేశ్‌

హోదాకు చట్టాలతో పని లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చట్టాలతో పని లేదని, పార్లమెంట్‌లో ప్రధాని ప్రకటనే ఒక చట్టమని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వడం ఒక్కటే మార్గమన్నారు. విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్టు ప్రకటించారని, అలాగే ఎన్నికల సమయంలో బిజెపి మ్యానిఫెస్టోలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ రెండు అంశాలూ ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సరిపోవా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారక యాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాకు చేరింది. కాకినాడలో ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఎం ఎం పళ్ళంరాజు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జెడి శీలం మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో 14 కేంద్ర సంస్థలు, 3 ఎయిర్‌పోర్టులు, విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐదేళ్లు చాలవని, అధికారంలోకి వస్తే పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి నేత ఎం వెంకయ్యనాయుడు వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటివరకు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఇందులో ఈ ఒక్క రాష్ట్రానికి చట్టం చేయలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చట్టం చేయలేదంటూ బిజెపి నాయకులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలుచేశారో వివరిస్తూ ఈనెల 31వ తేదీ తరువాత గ్రామస్థాయిలో కరపత్రాల ద్వారా వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.