ఆంధ్రప్రదేశ్‌

ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: ప్రభుత్వానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందంటే సదావర్తి భూములకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమేనని ఎపి సిఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖలో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఆక్రమణలపాలైన సదావర్తిసత్రం భూములను ఎలా ఉన్నవి అలాగే తీసుకునే ఒప్పందం ప్రకారం వేలం వేశామన్నారు. ఈ భూములు వేలకోట్లు ధర పలుకుతున్నప్పటికీ కారు చౌకగా కట్టబెట్టారంటూ విపక్షం చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. గతంలో ఒకసారి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదావర్తి భూములపై తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదించారని, తరువాత తమ పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర లేఖ రాశారని గుర్తు చేశారు. భూములన్నీ ఆక్రమణలకు గురికాగా, వీటిని కాపాడే అవకాశం లేనందునే వేలం వేయాల్సి వచ్చిందన్నారు. భూముల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, రూ. 5 కోట్లిచ్చి తీసుకోమని బహిరంగంగానే చెప్పామన్నారు.
అయితే వైకాపా నాయకుడొకరు రూ.29 కోట్లు ఇస్తానంటూ సవాలు చేశారన్నారు. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే తాము మరోసారి భూముల వేలం నిర్వహిస్తామని, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే వైకాపా ప్రతినిధికి 10 శాతం ఇనె్సంటివ్ ఇవ్వడమే కాకుండా, సన్మానం చేస్తామన్నారు. తాము బురదలో పొర్లుతూ ఇతరులపై బురదజల్లేందుకు యత్నించే విపక్షం పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని అన్నారు. తాను తప్పు చేయనని, రుజువు చేస్తే దేనికైనా సిద్ధమన్నారు.
బహిరంగ వేలానికి సిద్ధం: మంత్రి మాణిక్యాలరావు
అద్దంకి: సదావత్ భూములకు బహిరంగ వేలం నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా అద్దంకిలో విలేఖర్లతో మాట్లాడుతూ సదావత్ భూములకు వేలం నిర్వహించినప్పటికీ ఎక్కువ మంది వేలంలో పాల్గొనలేదని, అందుకోసం మరోసారి టెండర్లు పిలుస్తామన్నారు. బహిరంగ వేలం ద్వారా భూములు వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ భూములు ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు.
వాటిని స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన న్యాయసలహాలు తీసుకుంటున్నామన్నారు. దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారి జాబితాను ఆయా దేవాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. భూములు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను ఆన్‌లైన్‌లో నమోదుచేసి, వారికి నోటీసులు పంపిస్తామన్నారు. జీర్ణోద్ధరణలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాలు ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.