ఆంధ్రప్రదేశ్‌

విదేశీ విద్యకు వెన్నుదన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: తెలుగువారు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని, మనవాళ్లు ఎక్కడ అవకాశాలు ఉన్నా అందిపుచ్చుకుని ముందంజలో ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం సిఎంఓలో విదేశీ విద్యార్థి దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాపు కార్పొరేషన్ ఎంపిక చేసిన 145 మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇంతమంది విద్యార్థులు కృతజ్ఞతగా స్పందిస్తుంటే, వారి మనసులో ఆనందాన్ని చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ మధ్య విదేశీ పర్యటనల్లో అనేక మంది తెలుగు విద్యార్థులను చూశానని తెలిపారు. రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో మన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడి విదేశీ విద్యకు అవకాశాలు లేని కాపు సామాజిక విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రానికి ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నప్పటికీ సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడలేదని, 16 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రతి నెలా నిరంతరాయంగా చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవాలన్నా అనేక ఆంక్షలు, పరిమితులున్నాయని, కేవలం 3 శాతం అప్పులు మాత్రమే తీసుకునే వీలుందని సిఎం చెప్పారు. ప్రపంచంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుగా మనమే ఉపయోగించుకుని ముందడుగు వేయాలని, తొలిసారి ఫలాలను మనమే అందుకోవాలన్నది తన అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు.‘విదేశీ విద్యకు ఎంపికయిన కాపు సామాజిక వర్గ విద్యార్థులందరికీ బెస్ట్ఫా లక్’ అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. అంతకు ముందు ‘విదేశీ విద్యార్థి దీవెన’ పథకానికి ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందోద్వేగాలతో స్పందించారు. తమకు ఈ అవకాశాన్నిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంతో రుణపడి ఉంటామని, తాముకూడా భవిష్యత్తులో పైకివచ్చి అందరికీ సహాయపడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్య దీవెన పథకం కింద ముందుగా 145 మందిని ఎంపిక చేసింది. మొత్తం 400 మంది విద్యార్థులను దశలవారీగా విదేశీ విద్యకు ఎంపిక చేయనుంది. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఏఏ డిగ్రీలు, ఏఏ దేశాల్లో, ఏఏ యూనివర్శిటీల్లో చదువుకుంటారో వారి ప్రాధాన్యతకే అవకాశమిచ్చారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ, పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.