ఆంధ్రప్రదేశ్‌

ముచ్చటగా మూడో ముహూర్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 20: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి నేడు రెండోవిడత మరో మూడు శాఖల ఉద్యోగులను తరలించనున్నారు. ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో రవాణా, రోడ్లు, భవనాలశాఖ, విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని ప్రారంభిస్తారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక బస్సులలో బయల్దేరి మధ్యాహ్నం గం.1.35లకు చేరుకుంటారు. ఈ ఉద్యోగుల తరలింపు ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. నిజానికి జూన్ 29కల్లా ఐదో బ్లాక్‌లో కార్యాలయాలు ఏర్పాటవుతాయని భావించారు. అయితే పంచాయతీరాజ్, గృహ నిర్మాణశాఖలకే పరిమితం కావలసి వచ్చింది. ఆ తరువాత ఈ నెల 11, 13 తేదీలలో రెండో ముహూర్తాన్ని సీఆర్డీయే అధికారులు నిర్ణయించారు. అప్పటికీ పనులు పూర్తికాక పోవడంతో సచివాలయ ఉద్యోగ సంఘాల విజ్ఞాపన మేరకు ఈనెల 21, 29 తేదీలకు మరోసారి తరలింపు వాయిదా పడింది. ప్రస్తుతం సచివాలయ భవనాలలో ఐదో బ్లాక్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. కాగా మిగిలిన నాలుగు బ్లాకులకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ పనులే ఇంకా పూర్తికాలేదు. వీటిని నెలాఖరులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలను సీయం ఆదేశించారు. ఈనెల 26 నాటికి మరో రెండు భవనాలు అవుతాయనివని అధికారులు చెప్తున్నారు. సచివాలయంలో డ్రైనేజి ప్రధాన సమస్యగా మారింది. తాత్కాలిక ఏర్పాట్లు చేసినా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు అంతరాయం కలగటంతో ఇటీవలే నిల్వ ఉన్న డ్రైనేజీ నీటిని తొలగించారు. కాగా సచివాలయ భవన నిర్మాణ పనులను సీయం చంద్రబాబు గురువారం ఉదయం 10 గంటలకు పరిశీలించనున్నారు. రెండోవిడత ఉద్యోగుల తరలింపు.. సదుపాయాల కల్పనతో పాటు అన్ని బ్లాకులను నెలాఖరులోగా సిద్ధం చేయాలని మంత్రులను, కాంట్రాక్టు సంస్థలను సీయం ఆదేశించారు.