ఆంధ్రప్రదేశ్‌

జాతిపితకు అవమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, జూలై 3: గుర్తుతెలియని వ్యక్తులు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి గోనెసంచెతో ముసుగు వేసి అవమానపరచిన సంఘటన శనివారం రాత్రి అనంతపురం జిల్లా గోరంట్లలో చోటుచేసుకుంది. దీంతో మండల కేంద్రమైన గోరంట్లలో ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి చెందిన ఆకతాయిలు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి గాంధీ విగ్రహం చేతిలో ఉన్న కర్ర, కళ్లజోడు ఎత్తుకెళ్లారు. అంతేకాక విగ్రహం తల కనబడకుండా గోనె సంచితో ముసుగు వేసి, కర్ర పట్టుకున్న చేతిపై అట్టపెట్టె ఉంచి అందులో చెత్తాచెదారం వేశారు. ఆదివారం ఉదయం దీనిని గమనించిన ప్రజలు, ఆర్యవైశ్య సంఘం, బిజెపి నాయకులు ఆందోళనకు ఉపక్రమించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి వారితో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, బిజెపి, టిడిపి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురం జిల్లా గోరంట్లలో మహాత్మాగాంధీ విగ్రహం తలకు గోనెసంచి చుట్టిన దృశ్యం