ఆంధ్రప్రదేశ్‌

‘మహిమ’ దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 3: తమ వద్ద ఉన్న నాణేనికి మహిమలున్నాయని ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగల ముఠా పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం ఇక్కడి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వివరాలు తెలిపారు. విజయనగరానికి చెందిన దేవుడుబాబు అనే వ్యక్తి గండ్రేటి సురేష్‌తోకలిసి శ్రీరామచంద్రులు బొమ్మవున్న ఓ నాణేన్ని సంపాదించి, దీంతో సొమ్మును ఏ విధంగా సంపాదించాలన్నదానికి ప్రణాళిక సిద్ధం చేశారు. విశాఖపట్నానికి చెందిన వేమిరెడ్డి ప్రసాదు, కోరాడ రమేష్‌తో పాటు మరో ఇద్దరు గిరిజనులను వారి టీంలో చేర్చుకొన్నారు. సంపన్నుల వద్దకు వెళ్ళి, ముందుగా వారికి నమ్మకం కలిగేలా, కొన్ని రసాయనాలతో డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తివద్దనుంచి 50 లక్షలు దోచుకొని పరారుకాగా, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకుని ఆదివారం అరెస్టుచేశారు. పోలీసులు అనుసరించిన వ్యూహాన్ని సైతం తిప్పికొట్టేలా నిందితులు సుమారు 30, 40 సెల్‌ఫోన్లు, సిమ్‌లు మార్చినట్టు విచారణలో తేలింది. 47 లక్షల రూపాయల నగదుతో పాటు వారు వినియోగించే బొమ్మ తుపాకి, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.