ఆంధ్రప్రదేశ్‌

రాష్టవ్య్రాప్తంగా ఏడుచోట్ల శ్రీనివాస కల్యాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 3: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెలలో రాష్టవ్య్రాప్తంగా ఏడు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు. ఈనెల 9న శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం మహారజోల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో, 10న అదే జిల్లాలోని పొందూరులోని ఎస్‌పిఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణాలు జరుగనున్నాయి. 11న విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లిలోని నిత్యానంద ఆశ్రమం, 13న తూర్పుగోదావరి జిల్లా గాడాలలోని అభయ పొన్నూరి రియల్ ఎస్టేట్ మైదానంలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నారు. 14న ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామనగర్‌లో, 16న చిత్తూరు జిల్లా పీలేరు మండలం వెంకటాద్రి ఇండ్లు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణాలు ఘనంగా జరుగనున్నాయి. 17న జిల్లాలోని సి.రామాపురంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.