ఆంధ్రప్రదేశ్‌

పట్టణీకరణ సమస్యల పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 3: పట్టణీకరణ, ఎదుర్కొంటున్న సవాళ్లపై బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) సదస్సును విశాఖలో నిర్వహించనున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో ఈ సదస్సు జరిగే అవకాశం ఉంది. ఐదు బ్రిక్స్ దేశాల్లో జరుగుతున్న పట్టణీకరణపై సెప్టెంబర్ 14 నుంచి 16 వరకూ మూడు రోజుల పాటు కీలక చర్చ జరపనున్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం ప్రజానీకం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారు. బ్రిక్స్ దేశాల్లో జిడిపి 16 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. పట్టణీకరణలో చోటుచేసుకుంటున్న విధానాలు, పరిస్థితులపై ఐదు దేశాల ముఖ్యులు, అధికారులు విస్తృతంగా చర్చించనున్నారు. పెరుగుతున్న పట్టణ జనాభా, వారికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై బ్రిక్స్ దేశాల సదస్సులో కీలకాంశంగా భావిస్తున్నారు. పట్టణీకరణకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే మిగతా బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ, అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి అనుసరిస్తున్న విధానాలపై చర్చించి, వాటిలో ఆచరించతగిన అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. అర్బన్ ఫోరం రెండో సదస్సు దక్షిణాఫ్రికాలోని దర్బన్‌లో జరిగింది. విశాఖలో జరిగే బ్రిక్స్ దేశాల మూడో అర్బన్ ఫోరం సదస్సు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక భూమిక పోషించనుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వీరితో పాటు పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులు, ప్రత్యేక ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్, పోలీసు డైరెక్టర్ జనరల్ తదితరులు భాగస్వామ్యం వహిస్తారు. సదస్సు నిర్వహణకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో కమిటీని వేశారు. ఈ కమిటీలో జివిఎంసి కమిషనర్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సుమారు 500మంది వరకూ బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, ఇతర అతిధులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. అర్బన్ ఫోరంపై బ్రిక్స్ దేశాల సదస్సు విషయమై జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణీకరణ, సవాళ్లపై జరిగే ఈ సదస్సు భవిష్యత్ రూపకల్పనకు ఎంతో దోహదం చేస్తుందన్నారు.