ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 3: బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వ్యక్తం చేశారు. వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ఆయన ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రాజకీయాల్లో కూడా తమ వంతు సాధించేందుకు అంద రూ కృషి చేయాలన్నారు. బ్రాహ్మణులు అందరూ ఐక్యంగా ఉంటే సాధించలేనిదేమి లేదన్నారు. గతం లో రాజకీయాలను బ్రాహ్మణులు శాసించే స్థాయి ఉండేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యత లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వెనుకబడిపోతున్నామని తెలిపారు. బ్రాహ్మణులు అంటే ఓటు వేయరన్న అపవాదు ఉందని, దానిని తొలగించేందుకు అందరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలపై అవగాహన, చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కును వినియోగించడం ద్వారా బ్రాహ్మణులు తమ డిమండ్లను పరిష్కరించుకునే వీలు ఉంటుందన్నారు. ప్రభు త్వం బ్రాహ్మణుల అభివృద్ధికి అనేక పథకాలు చేపడుతోందని తెలిపారు. వీటని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులకు సంబంధించిన వివిధ పథకాల వివరాలను ఆయా వెబ్‌సైట్లలో అప్‌డేట్ చేసేందుకు వీలుగా కేంద్రా న్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్కడ ఉచితంగా అన్ని వివరాలను అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. ఆ కేం ద్రంలో ఇతరులకు కూడా అవకాశం కల్పించేందుకు ప్రతిపాదించామని తెలిపారు. ఎపిపిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ హోదాల్లోకృష్ణారావు పని చేసిన తీరు అభినందనీయమన్నారు.