ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమీక్షించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: ఏపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని తాము ఇచ్చిన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొనడం గర్హనీయమని వైకాపా ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ నెల 8న ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణకు రానుందన్నారు. సుప్రీం కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. స్పీకర్ పార్టీలకు అతీతంగా నడుచుకోవాలన్నారు. కాని ఏపి స్పీకర్ వైకాపా పట్ల పక్షపాత వైఖరితో ఉన్నారన్నారు. తాము ఇచ్చిన పిటిషన్‌ను అనేక నెలలు పెండింగ్‌లో పెట్టి అప్పటికప్పుడు ఆదరాబాదరగా నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల చట్టంలో పేర్కొన్నట్లుగా అమలు చేయడంలో స్పీకర్ విఫలమయ్యారన్నారు.