ఆంధ్రప్రదేశ్‌

భూమా నాగిరెడ్డికి స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 3 : కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఉన్న తన నివాసంలో భూమా అస్వస్థతకు గురికావటంతో అనుచరులు వెంటనే సమీపంలోని సురక్షా ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు రవికృష్ణ, హరినాథ్‌రెడ్డి, మధుసూదన్‌రావు భూమాకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి గుండెపోటు కాదని, జీర్ణవాహికలో కలిగిన మార్పులకు ఇలా అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. ఎమ్మెల్యే భూమా ఉదయం నుంచి నంద్యాల పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతగా ఉండడంతో భూమా ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో భూమా కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేరు. దీంతో ఆయన అనుచరులు కౌన్సిలర్ శివశంకర్, ఏవిఆర్ ప్రసాద్, తదితరులు హుటాహుటిన భూమాను సురక్షా ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డలో ఉన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కుమారుడు ఈ విషయం తెలిసిన వెంటనే సురక్ష ఆసుపత్రికి చేరుకుని తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూమా కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే భూమాకు గుండెపోటు వచ్చిందన్న వార్త నంద్యాల పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో ఆయన అభిమానులు, అనుచరులు సురక్షా ఆసుపత్రికి చేరుకుని భూమా ఆరోగ్యంపై ఆరా తీశారు. గుండెపోటు కాదని స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యాడని తెలుసుకుని వారు ఊపిరిపీల్చుకున్నారు.