ఆంధ్రప్రదేశ్‌

వచ్చింది ఆరువేల కోట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. కాని ఆచరణలో ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనా, జపాన్, ఉత్తరకొరియా, సింగపూర్ తదితర దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. అనేక ఎంఓయూలు ఖరారయ్యాయి. చైనా, జపాన్‌ల నుంచి రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనుకుంటే ఇంతవరకు రూ.6వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం సిఐఐ ఆధ్వర్యంలో భారీ సదస్సును రాష్ట్రప్రభుత్వం నిర్వహించింది. రూ. 4.3 లక్షల కోట్ల ఎంఓయూలు ఈ సదస్సులో ఖరారయ్యాయి. దేశ ప్తంగా ఈ సదస్సును చంద్రబాబు బాగా నిర్వహించారనే పేరు వచ్చింది. కాని పెట్టుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్‌లాండ్ కోల్ సంస్ధ 30 వేల కోట్ల రూపాయలతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. కాని ఇంతవరకు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. సహజవాయువు ప్రాజెక్టుల రంగంలో మలేషియాకు చెందిన ఐసోమెట్రిక్ హోల్డింగ్స్, పెట్రోనాస్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనపరిచాయి. వాల్‌మార్ట్, ఫ్యూచర్ స్పెన్సర్స్ సంస్థలు రూ. 1500 కోట్లతో పెట్టుబడులు పెడుతామని ప్రకటించాయి. ఇవన్నీ రిటైల్ బిజినెస్ పుంజుకునేందుకు కృషి చేసే బహుళ జాతి సంస్ధలు. గత కొన్ని సంవత్సరాలుగా ఏపికి వచ్చే పెట్టుబడులు చిత్తూరు జిల్లా శ్రీ సిటీకే పరిమితమవుతున్నాయి. ఇక్కడ అద్భుతమైన వౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.4 వేల కోట్ల విలువైన మొబైల్ యూనిట్లు రానున్నాయి. ఫాక్స్‌కాన్, ఇసుజు, కాడ్‌బెర్రీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. విద్యా రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, ఆరోగ్య రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు మదుపు చేసేందుకు వివిధ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991 నుంచి 2014 వరకు వివిధ పరిశ్రమలతో ఖరారు చేసుకున్న ఎంఓయూల విలువ రూ. 8.96 లక్షల కోట్లు. కాని రూ. 41,900 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. మొత్తం ప్రతిపాదనల్లో ఐదు శాతం లోపు పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశంపై మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సులు, విదేశీ పర్యటనల్లో ఖరారైన ఎంఓయూలన్ని కార్యరూపం దాల్చవని, అందులో 10 శాతం వరకు పెట్టుబడులు వస్తే విజయం సాధించినట్లేననడం విశేషం. ఈ సదస్సుల వల్ల రాష్ట్రంలో ఉన్న వౌలిక సదుపాయాలు, మానవ వనరులను ప్రపంచానికి చాటినట్లవుతుందని చంద్రబాబు స్వయంగా పేర్కొన్నారు. ఈ విషయమై వైకాపా శాసనసభ పక్ష ఉపనేత విశే్వశ్వరరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో ఎంఓయూలు కాగితాలకే పరిమితమయ్యాయని,ప్రచారం ఆర్భాటం తప్ప ఒక్క పరిశ్రమ రావడం లేదన్నారు. ఫ్యాప్సీ మాజీ అధ్యక్షుడు అట్లూరి సుబ్బారావు మాట్లాడుతూ అన్ని ఎంఓయులు కార్యరూపం దాల్చకపోవచ్చని, కాని 15 శాతం పెట్టుబడులు వస్తే పరిశ్రమల రంగం రూపురేఖలు మారిపోతాయన్నారు.