ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.83 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 2: ఈ ఏడాది రాష్టవ్య్రాప్తంగా 83 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుగా అందించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎపి ప్రభుత్వం రూ.1,65,538తో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసింది. రైతులు పెట్టుబడులకు ఇబ్బంది పడకుండా, వారు ప్రైవేటు రుణదాతలపై ఆధారపడకుండా ప్రభుత్వం తక్కువ వడ్డీకి, అసలు వడ్డీ లేకుండా కూడా బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా రుణ సౌకర్యం కల్పించింది. జిల్లాల వారీగా ఖరీఫ్, రబీ పంట రుణాలు, కాలపరిమితి రుణాల వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించింది. రాష్ట్ర రుణ ప్రణాళిక మొత్తం 1,65,538 కోట్ల రూపాయలలో 75.84 శాతం వ్యవసాయ రంగానికే ప్రభుత్వం కేటాయించింది. వార్షిక రుణ ప్రణాళికలో ఖరీఫ్‌లో రూ.36 వేల కోట్లు, రబీలో రూ.24 వేల కోట్లు మొత్తం రూ.60 వేల కోట్ల రూపాయలను పంట రుణాలుగా అందించనున్నారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 23 వేల కోట్ల రూపాయలు అందించనున్నారు. జిల్లాల వారీగా వార్షిక రుణ ప్రణాళికలను పరిశీలిస్తే గుంటూరులో రూ.11,404 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.10,274 కోట్లు, చిత్తూరు జిల్లాలో రూ.6,918 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో రూ.3,501 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.10,021 కోట్లు ఇవ్వనున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో రూ.2,405 కోట్లు, విశాఖ జిల్లాలో రూ.3,432 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.7,143 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ.6,603 కోట్లు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ.4,891 కోట్లు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రూ.4,799 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.6,425 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ.5,184 కోట్లు అందజేస్తారు. లక్ష రూపాయల లోపు పంట రుణం తీసుకొని ఏడాది లోగా తిరిగి చెల్లిస్తే వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు. లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణం తీసుకుని ఏడాది లోపు తిరిగి చెల్లిస్తే పావలా వడ్డీ పథకం వర్తిస్తుందని, రైతులకు ఇచ్చే పంట రుణాలపై బ్యాంకులకు ప్రభుత్వం మూడు శాతం వడ్డీ చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 9 లక్షల 90 వేల 664 మంది కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందజేయాలని ప్రతిపాదించారు. భూములు సాగుచేసే కౌలు రైతులకు రెవెన్యూ శాఖ వారు కొత్తగా రుణ అర్హత కార్డులు ఇస్తారు. గతంలో తీసుకున్నవారికి రెన్యువల్ చేస్తారు. ఆ కార్డులు ఉన్న వారికి వ్యవసాయ రుణాలు ఇస్తారు. రైతులకు, కౌలుదారులకు ఈ విధంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే నాటికే రుణాలు అందజేయడం ద్వారా ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది.