ఆంధ్రప్రదేశ్‌

శాఖాభేదాలకు స్వస్తిచెప్పి రాజకీయాల్లోకి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), జూలై 2 : బ్రాహ్మణులు రాజకీయాల్లో అడుగుపెట్టి తమను తాము నిరూపించుకోవాలని ఆంధ్రా బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్, విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు అభిలషించారు. రాజకీయాల్లో తమ వాటాను అడిగి తీసుకోవాలని, తద్వారా పురోగతి సాధించవచ్చన్నారు. శనివారం పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యా వికాసం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధనలో పాలు పంచుకున్న బ్రాహ్మణులు, అనంతరం రాజకీయంగా వెనకడుగు వేశారన్నారు. వారు శాఖాభేదం విడనాడాలని, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇది అధికమని అన్నారు.
అంతా సమైక్యంగా పని చేయాలని హితవు పలికారు. బ్రాహ్మణుల్లో ఆత్మస్థైర్యం కొరవడుతోందని, వారు ఉద్యోగాల వేటలో కాక కల్పనలో ముందుండాలని అన్నారు. ఉద్యోగ విరమణానంతరం తాను సిఎంను కార్పొరేషన్ పదవి అడిగి మరీ తీసుకున్నానని అన్నారు. తనకు ఈ పదవి రాకున్నా, తన సంకల్పం బ్రాహ్మణ సంక్షేమమేనని అన్నారు. ఈ పదవిలో సంపూర్ణ తృప్తితో ఉన్నానని అన్నారు. కార్పొరేషన్ పేద బ్రాహ్మణులకు అందించే పలు పథకాలను వారి చేరువకు తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా, నిరంతరం క్రమబద్ధంగా పని చేసే చైతన్య సారథులు కావాలని అన్నారు. ప్రతి జిల్లాలో స్థానిక నాయకత్వం ఇందుకు కృషి చేయాలన్నారు. కావూరి చరణ్‌కుమార్ అధ్యక్షత వహించిన సభలో రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ విశిష్ట అతిథిగా మాట్లాడుతూ బ్రాహ్మణులు తమ జ్ఞానంతో సమాజానికి మేలు చేస్తారన్నారు. మంచిగా ప్రవర్తించడం వారి బలము, బలహీనత అన్నారు. మాజీ శాసన సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్, గంటి సూర్యనారాయణమూర్తి, వెల్ఫేర్ కార్పొరేషన్ సంధానకర్త వి. పురుషోత్తమరాజు, టి. ఎస్. ఆర్. ప్రసాద్ వేదికను అలంకరించి ప్రసంగించారు.