ఆంధ్రప్రదేశ్‌

చందన కేసులో విచారణకు డిఐజి ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 30: ప్రేమించలేదని తిరుపతి కనక భూషణం లే ఔట్‌కు చెందిన చందన అనే విద్యార్థిని నవీన్, యశ్వంత్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆమెను హతమార్చడానికి ప్రయత్నించిన కేసులో అలిపిరి పోలీసులు నిర్లక్ష్యం వహించడం పట్ల డిఐజి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒక విద్యార్థినిని హతమార్చడానికి తెగబడ్డ ప్రేమోన్మాదులపై కఠినచర్యలు చేపట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేయడం పట్ల డిఐజి మండిపడ్డారు. కేసును నిర్లక్ష్యంచేసిన అలిపిరి పోలీసుల తీరుపై విచారణ జరిపించి నివేదిక అందించాలని ఈస్ట్ డిఎస్పీని ఆయన ఆదేశించారు. జూన్ 1న నవీన్, యశ్వంత్ అనే యువకులు చందన అనే ఇంటర్ విద్యార్థిని స్కూటీపై వెళ్తుండగా మోటర్ సైకిల్‌తో ఢీకొట్టిన విషయం పాఠకులకు విదితమే. ఈసంఘటనలో చందన వెనె్నముక దెబ్బతిని చికిత్స పొందుతూ మంచానికే పరిమితం అయింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించి నిందితులను శిక్షించాలని రోడ్డెక్కాయి. తల్లిదండ్రులు ఫిర్యాదుచేసినా అలిపిరి పోలీసులు ఈ కేసును నిర్లక్ష్యం చేశారు. మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో అటు తరువాత ఆలస్యంగా పోలీసులు నిందితునిందితులపై నిర్భయకేసులు పెట్టాలని బాధితురాలికి తగిన న్యాయం చేయాలని పలు సంఘాల నుండి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే డిఐజి కూడా తీవ్రంగా స్పందించి అలిపిరి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.